ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనను నామినేట్ చేశారు. 63 ఏళ్ల అజయ్ బంగా.. మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు. ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్లో వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. గతంలో మాస్టర్ కార్డ్లో CEOగా వ్యవహరించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుకు నడిపించడానికి అజయ్ బంగా చాలా అవసరమని బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.

