Home Page SliderInternationalNews AlertSports

టీమ్ స్పిరిట్‌తో కప్పు కొట్టిన భారత్..ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు పాక్ గైర్హాజరు..

 ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన టీమిండియా విజయానికి మూల కారణం టీమ్ స్పిరిట్ అని చెప్పక తప్పదు. ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్క స్టార్ ప్లేయర్ రాణించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రెజెంటేషన్ ఈవెంట్‌కి ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ నుండి పీసీసీ బోర్డు నుండి ఎవ్వరూ హాజరు కాకపోవడం విమర్శలకు దారితీసింది. ఆతిథ్య దేశం పాక్ మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం, దాయాది దేశమైన భారత్ అన్ని మ్యాచ్‌లలో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోవడంతో పాక్ ప్రతినిధులను పంపలేదని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు కురిపించారు.   ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 76 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, బలమైన న్యూజిలాండ్ జట్టును ఓడించారు. గత ఛాంపియన్స్ ట్రోఫీని చేజార్చుకున్న భారత్ ఈసారి వదల్లేదు. హార్దిక్ పాండ్య మాట్లాడుతూ 2017 ఫైనల్స్ ఓటమి తమనెంతో బాధపెట్టిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ విజయం సాధించడం ఎంతో అద్బుతంగా ఉందని వ్యాఖ్యానించారు.