‘భారతదేశం ధర్మశాలేం కాదు?’..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
శ్రీలంక శరణార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింది కోర్టు. భారత్ ఏమైనా ధర్మశాల అనుకున్నారా అంటూ ప్రశ్నించింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ను కొట్టివేస్తూ, భారత్‌లో ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్నారని, ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికేమీ ధర్మశాల కాదని వ్యాఖ్యానించింది. వెంటనే శరణార్థులు దేశం విడిచి వారి దేశానికి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు.