భారత్-న్యూజిలాండ్ ఫైనల్స్..వెలుగులోకి రూ.5 వేల కోట్ల బెట్టింగ్
టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయిలో నేడు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లపై భారీ ఎత్తున బెట్టింగులు కొనసాగుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ సమయంలో బెట్టింగుల రాకెట్‌లో కొందరిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఫైనల్స్‌లో కూడా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా బెట్టింగ్ జరగవచ్చని అంచనా. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌లో ఈ ముఠాలు ఒక మాస్టర్ ఐడీని ఉపయోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ ముఠాలకు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’తో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దేశ విదేశాలలో వీరు ఈ బెట్టింగ్ యాప్‌ను నడుపుతున్నారు. కెనడాలో బెట్టింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిన ఛోటా బన్స్ అనే వ్యక్తి ప్రస్తుతం దుబాయిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మ్యాచ్ లైవ్‌లో ఉండగానే ఎప్పటి విషయాలు అప్పుడు బుకీలకు తెలిసిపోతుంటాయి.