హైద్రాబాద్‌లో పెరుగుతున్న HMPV కేసులు
చైనా వైరస్ హైద్రాబాద్‌లో శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ విషయంలో సోషల్ మీడియా లో ప్రచారం,కేంద్ర ప్రభుత్వ ప్రచారం రెండూ భిన్నంగా ఉన్నప్పటికీ ఆసుపత్రి వర్గాలు మాత్రం HMPV వైరస్ ఉందనే చెప్తున్నారు.ఇది పాతికేళ్ల కిందటే వచ్చినప్పటికీ ప్రస్తుతం వృద్ది చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైద్రాబాద్‌లో ఇప్పటికే 11 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సంక్రాంతి ముగిసే లోపు కేసులు వందల సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.