NewsNews AlertTelangana

వినియోగదారుల బెంబేలెత్తిస్తున్న క్రూడాయిల్ ధరలు

అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు మళ్లీ తారా స్థాయికి చేరుతున్నాయి. నిన్న మెన్నటి వరకు మార్కెట్‌లో వీటి రేటు వంద డాలర్ల కన్న తక్కువగానే ఉన్న ఉండగా , తాజాగా వీటి ధరలు బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారల్ ఒక్కింటికి 102.04 డాలర్లు పలికింది. దీవనితో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మిడియట్‌లో ఈ ధర 95.48 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదవగా , బ్రెండ్ క్రూడ్ ప్రెస్ 100 డాలర్ల మార్కుని క్రాస్ చేసింది. ఈ ధరల పెంపుతో వాహన దారులు బెంబేలేత్తి పోతున్నారు. రేట్టు భారీగా తగ్గిన సమయంలోనే కేంద్రం వాహనదారులుకు ఎటువంటి ఊరట కల్పించక పోగా ఇప్పుడు ఇక వాటి ఊసు మర్చిపోవాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు.

క్రూడాయిల్ రేట్లు 105 నుండి 110 డాలర్లు వరకు వెళ్తే మళ్లీ వాటి రేట్లు పెరిగే అవకాశం లేకపోలేదని , చమురు కంపెనీలు దీనిపై కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ధరల ప్రకారం..హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 109.66 పైసలు , డీజిల్ రూ.97.82 పైసలుగా రికార్డయింది.