HealthHome Page SliderInternational

హిమోగ్లోబిన్ ఇలా పెంచుకోండి

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు. నేషనల్ అనీమియా యాక్షన్ కౌన్సిల్ ప్రకారం అనీమియాకు ఐరన్ లోపం కూడా ఒక కారణం. అందుకే ఆహారంలో ఐరన్ లోపాన్ని తగ్గించే పదార్థాలను తీసుకుంటే రక్తహీనత నుండి తప్పించుకోవచ్చు. పాలకూర, బీట్‌రూట్ వంటి కూరగాయలలో ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, పుచ్చకాయలు, దానిమ్మ వంటి పండ్లు కూడా రక్తహీనతను తగ్గిస్తాయి. ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, బాదం పప్పు, గుమ్మడి గింజలు వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, నిమ్మ, ఉసిరి వంటి పదార్థాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటి ద్వారా అనీమియాను అరికట్టవచ్చు.