మహిళతో అనుచిత ప్రవర్తన..ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ముంచుకొస్తుంటే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. ఆప్ ఎమ్మెల్యే దినేష్ మెహానియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీనితో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీలో ఒక మహిళను చూస్తూ అతడు సైగలు చేయడం, అనంతరం ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. అతడి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడుసార్లు సంగం విహార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన దినేష్ మరోసారి ఇదే నియోజక వర్గం నుండి పోటీలో నిలిచారు. దీనికి ముందు అతనిపై మరో కేసు కూడా నమోదయ్యింది. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారని దుర్భాషలాడిట్లు కూడా కేసు నమోదయ్యింది. అయితే అతడు మురుగు కాలువ పక్కన దుకాణం పెట్టుకున్నాడని, దీనివల్ల కార్మికుల పనులకు ఆటంకం కలుగుతోందని వెళ్లిపోమని చెప్పినట్లు సమాచారం.

