యూపిలో..మీర్ పేట్ ఘటన రివర్స్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట్ భార్య హత్యోదంతం అందిరికీ గుర్తుండే ఉంటుంది.కనీసం ఆధారాల్లేకుండా కిరాతకంగా హత్య చేసిన వ్యవహారంపై పోలీసులు సీరియల్ ఇన్వెస్టిగేషన్ చేశారు.భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కమర్షియల్ గ్యాస్ స్టౌ పై కాల్చి ఎముకలను బూడిదగా చేసి చెరువులో కలిపేశాడు ఓ ఆర్మీ భర్త.ఇదే సీన్ యూపిలో వెలుగు చూసింది.అయితే మీర్ పేట్ సీన్ రివర్స్ అయ్యింది.ఇక్కడ ఆర్మీ భర్త…అక్కడ నేవీ ఉద్యోగి భార్య.తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని మర్చంట్ నేవీలో పనిచేసే సౌరభ్ రాజ్‌పుత్ ఉద్యోగి భార్య…తన భర్తను ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్‌తో పూడ్చేసింది.రాజ్ పుత్ బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే …భర్తను ఏ విధంగా చంపిందో వివరించింది.పోలీసుల నిందితులను అరెస్ట్ చేశారు.

