సాధారణ వ్యక్తిలా జగన్ భార్యతో విమానంలో..
AP: మాజీ సీఎం YS జగన్ సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించడం చూస్తున్నాం. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో అందులోనూ ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల విజయవాడ నుండి బెంగళూరుకు ఎక్కువగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తుండడం మనకు తెలిసిన పాత విషయమే.

