ఉదయం ఆటోల్లో రెక్కీ.. అర్ధరాత్రి దొంగతనం
హైదరాబాద్‌లోని హయత్‌నగర్, అమీన్‌పూర్, వనస్థలిపురం ఏరియాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ సభ్యులు తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉదయం సమయంలో ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇక అర్ధరాత్రి కాగానే ఇళ్లలోకి చొరబడి.. దొరికినంతవరకు దోచుకుంటున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై క్రూరమైన దాడులకు, ఐరన్ రాడ్లతో కొట్టడం, ఇంకా కొన్ని సంఘటనలలో చంపేయడానిక్కూడా వెనుకాడడం లేదు.


 
							 
							