ఆ ఊరిలో ఇంటికో మగబిడ్డ సైన్యంలోనే..
ఏపీలోని ఆ గ్రామానికో ప్రత్యేకత ఉంది. ఆ ఊరిలో ఇంటికో మగబిడ్డ సైన్యంలో చేరవలసిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని మాధవరం అనే గ్రామం మిలటరీ మాధవరం అనే పేరుతో పాపులర్ అయ్యింది. ఆ ఊరిలో ఆర్మీలో పనిచేస్తున్నవారు ప్రతీ కుటుంబంలో ఉంటారు. మిలటరీలో రిటైరైనవారు కూడా ప్రతీ కుటుంబంలో ఉంటారు. కొత్తగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్స్ కోసం కసరత్తులు చేస్తున్నారు. అక్కడి ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని స్ఫూర్తితో ఈ గ్రామ యువకులు ఆసక్తిగా ఉన్నారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా సందిగ్ధత ఉన్నప్పటికీ అక్కడి వారికి మాత్రం ఎలాంటి భయం లేదు.

