పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ఆరు సిక్సర్లు
ఇస్లామాబాద్, మనసర్కార్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక అరుదైన రికార్డు సాధించారు. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఏకంగా ఎనిమిది స్థానాల నుండి పోటీ చేసి… ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సాగనంపే రోజు తొందరలోనే ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్. ప్రజల్లో తన పట్ల ఉన్న ఆదరణ ఏంటో తెలియజేసేందుకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసానన్నారు ఇమ్రాన్ ఖాన్… 8 స్థానాల్లో ఆరు చోట్ల విజయం సాధించి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. 11 నియోజక వర్గాల ఉప ఎన్నికలలో 8 స్థానాలలో పీటీఐ పార్టీ భారీ విజయం సాధించింది. అయితే ఈ స్థానాలలో ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే ఆరు స్థానాలలో విజయం సాధించడం రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పోటీ చేసిన ఏడింట్లో ఒక్క స్థానంలో మాత్రమే ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలను రిఫరెండంగా పేర్కొన్నారు ఇమ్రాన్. అధికార పక్షంపై ఇంత స్థాయిలో విజయం సాధించడం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లే షకులు అంటున్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పీటీఐ సభ్యులు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, పంజాబ్ ప్రొవిన్స్‌లో కూడా మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాల్లో పోటీ చేయగా, ఒక్క కరాచీలో మాత్రమే ఓడిపోయారు. దీనితో ఆరు అసెంబ్లీ స్థానాలలోనూ, రెండు ప్రావిన్సుల్లోనూ పీటీఐ పార్టీ విజయం సాధించినట్లయ్యింది. అధికార కూటమి మాత్రం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. దీనితో చట్టసభ సభ్యులు తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజలు నిరూపించారని పీటీఐ పార్టీ జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ పేర్కొన్నారు. పాకిస్థాన్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే ఎక్కువ స్థానాల్లో గెలిస్తో ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. దీనివల్ల ఆరు స్థానాల్లో గెలిచినా, ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా ప్రాతినిథ్యం వహించరని పీటీఐ పార్టీ పేర్కొంది.