News Alert

ఆకట్టుకుంటున్న అంజలి ఝాన్సీ

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఝాన్సీ వెబ్ సిరిస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సస్పెన్స్ , థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. దీని మొదటి భాగంలో తన గతాన్ని తెలుసుకోవడం కోసం శ్రమించే పాత్రలో అంజలి కనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో అన్నింటి కంటే పెద్ద శిక్ష.. తాను ఎవరు అనేది తనకు తెలియకపోవడం. అంటూ ప్రారంభమైన ట్రైలర్‌లోని డైలాగ్ అందరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. అలాగే నా ఫ్రండ్స్ ఎవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు. కానీ నా శత్రవులు ఎవరో నాకు తెలియాలి అంటూ ట్రైలర్ ముగుస్తోంది. అయితే ఈ సిరీస్ డిస్నీ స్టార్ వేదికగా అక్టోబర్ 27న విడుదల కానుంది.