NationalNewsNews Alert

మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల తొలగింపు పై హైకోర్టు కీలక నిర్ణయం  

ప్రార్థనలు నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరుకి చెందిన పౌరుడు చంద్రశేఖర్ హైకోర్టుకు ఈ పిల్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన కర్ణటక హైకోర్టు , భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం స్వంత మతాన్ని స్వచ్ఛగా ఆచరించడం , ప్రచారం చేయడం ఏమాత్రం తప్పుకాదని.. ఇది అందికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ హక్కు సంపూర్ణ హక్కు కాదని దీనికంటూ కొన్ని పరిమితులున్నాయని తెలిపింది. ఆరోగ్య భద్రత , పబ్లిక్ ఆర్డర్స్ దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుని ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది.

అదేవిధంగా రాజ్యాంగంలోని పార్ట్ 3 లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుందని , పిటిషినర్‌తో పాటు ఇతర విశ్వాసులకు వారి విశ్వాసాల ప్రకారం మతాన్ని ఆచరించే హక్కు ఉందని బెంచ్ స్పష్టం చేసింది. మసీదుల్లో అజాన్ అనేది ప్రార్థనలకు ఓ పిలుపని , అందులోని ప్రసంగాలపై అభ్యంతరాలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాలను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇది ఒక మత స్వేచ్ఛ హక్కని పేర్కొంది. కానీ అనుమతించిన డెసిబుల్స్ స్థాయికంటే ఎక్కువ స్పీకర్స్ , పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ వాడకుడదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.