క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక ప్రకటన..
క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డు గడువు తీరే లోపు చెల్లించకపోతే వడ్డీ పడుతుందనేది అందరికీ తెలిసిందే. తాజా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఈ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈ లేట్ పేమెంట్‌పై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ SCDRC నిర్ణయించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కార్డు బకాయిలపై సంవత్సరానికి 36 శాతం నుండి 49 శాతం వరకూ వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని ఈ పిటిషన్‌లో తెలిపింది. అయితే ఇది అన్యాయమని SCDRC గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. నిబంధనలు అనుసరించి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ మోరకు వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ ద్వారా పర్యవేక్షిస్తారని కోర్టు తెలిపింది. ప్రస్తుతం చాలా క్రెడిట్ కార్డులు వార్షిక వడ్డీ 22 శాతం నుండి 49 శాతం వరకూ వసూలు చేస్తున్నాయి.

