Home Page SliderTelangana

నేను తాటాకు చప్పుళ్లకు భయపడను: పొంగులేటి

తెలంగాణాలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి,జూపల్లి కృష్ణరావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణా రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. కాగా పార్టీ మారినప్పటి నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తనను అనేక ఇబ్బందులకు గురిచేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణాలో తాను చేసిన కాంట్రాక్టు పనులు 6ఏళ్ల క్రితమే ముగిశాయన్నారు. ఈ కాంట్రాక్టు పనిలో అవినీతి జరిగినట్లు అనుమానం ఉంటే విచారణ చేసుకోవచ్చని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతేకాకుండా ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు తాను ఏమాత్రం భయపడేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణాలో మరోసారి చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ఆశలు ఇక నెరవేరవన్నారు.