వరంగల్‌లో వెలుగు చూసిన అక్రమ జిలెటిన్ స్టిక్స్
వరంగల్ జిల్లా ఉరుసుగుట్టలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన సమాచారం మేరకు ఉరుసుగుట్టలో నివసించే ఓ మహిళ తన ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను అక్రమంగా నిల్వ ఉంచింది.ఇందులో 74 జిలెటిన్ స్టిక్స్ ఉండగా 100 డిటోనేటర్లున్నాయి.వీటితో పాటు 53 ఫీజులు కూడా లభ్యమయ్యాయి.దీంతో తనిఖీలుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం అవాక్కయ్యారు.ఒక సాధారణ మహిళ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు కనుగొనడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.మావోయిస్టు కార్యకలాపాల కోసం ఏమైనా నిల్వ ఉంచారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.