ఈజీగా ఆరోగ్యాన్ని పొందాలంటే చప్పట్లు కొడితే చాలు
ఏం కష్టపడకుండా ఈజీగా ఆరోగ్యాన్ని పొందే మార్గాలలో చప్పట్లు కొట్టడం అతి సులువైన పని. కేవలం చప్పట్లు కొట్టడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చంటే నమ్మశక్యం కావడం లేదు కదూ..కానీ ఈ పని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎవరైనా ఏదైనా ఘనకార్యం సాధిస్తే వారిని చప్పట్లు కొట్టడం ద్వారా అభినందిస్తాము. ఇలా చప్పట్లు కొట్టడం వలన మానసిక స్థితి మెరుగుపడుతుందట. అంతే కాదు కండరాలలో రక్తప్రసరణ మెరుగు పడుతుందని ఒక సర్వే ద్వారా తేలింది. అంతే కాదు మెడ, వెన్ను, కీళ్ల నొప్పల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి, గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. మనం చప్పట్లు కొట్టేటప్పుడు కూడా కొన్ని భంగిమలు పాటించవలసి ఉంటుంది. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ప్లేయర్ సెంచరీ కొడితే సోఫా లేదా మంచంపై పడుకుని చప్పట్లు కొడితే లాభం లేదు. నడుమును నిటారుగా ఉంచి, శరీరాన్ని పైకి లాగి చప్పట్లు కొడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.