Home Page SliderNationalPolitics

‘రాష్ట్రం బాగుండాలంటే త్వరగా పిల్లలను కనండి’..ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెళ్లయిన నవదంపతులు త్వరగా పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడులోని లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో ఆయన ఆందోళన చెందుతున్నారు. నాగపట్నంలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నియోజక వర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అందుకే జనాభాను పెంచుకోవాలి. అందుకే త్వరగా పిల్లలను కని, వారికి తమిళ పేర్లు పెట్టండి..’ అంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2026లో కేంద్ర ప్రభుత్వం పునర్విభజన పనులను చేపడితే, ప్రస్తుత జనాభా ప్రకారం రాష్ట్రానికి 8 నియోజకవర్గాల వరకూ తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.