PMAY పథకానికి సబ్సిడీ కావాలంటే ఇలా చేయాలి
ప్రధానమంత్రి ఆవాస యోజన PMAY పథకం ద్వారా ఇల్లు నిర్మించుకుందామంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇవన్నీ పాటిస్తేనే ఈ పథకం వర్తించి, సబ్సిడీ లభిస్తుంది. లేదంటే సబ్సిడీని కోల్పోతారు. దిగువ, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలకే ఇల్లు సొంతం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. అయితే ఏ బ్యాంకు వద్ద గృహరుణం తీసుకున్నారో అవి క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. రుణవాయిదాలు సకాలంలో చెల్లించకపోతే సబ్సిడీని కోల్పోవచ్చు. అలాగే నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మధ్యలో ఆపివేయకూడదు. ఎవరికైతే ఇల్లు కేటాయించబడిందో వారే ఆ ఇంట్లో నివాసం ఉండాలి. అద్దెలకు ఇవ్వకూడదు. పేదలు సొంతఇల్లు పొందేలా చూడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ షరతులు పాటించకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది.