‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటెయ్యండి’..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ట్రోఫీ గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగ ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ కులగణన వల్ల 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే వారికి 80 శాతం మందికి పైగానే లాభం జరుగుతుంది. బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీది చీకటి ఒప్పందం. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదు.? జవ్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు? కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, 51 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. 15 వేల కోట్ల రూపాయల మూసీ ప్రక్షాళన అంచనాను లక్ష కోట్ల రూపాయలని రేవంత్ చెప్తున్నారు’. అంటూ నిలదీశారు.

