“అన్నప్రాసనం రోజే ఆవకాయ పెడతానంటే నడవదు”: కేటీఆర్
ఇవాళ తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైటెక్స్‌లో GHMC వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్నప్రసానం రోజే ఆవకాయ పెడతానంటే నడవదని తెలిపారు. ఈ విధంగా GHMC ఆఫీసులు పెట్టిన తెల్లారే హైదరాబాద్‌ను శుభ్రంగా మార్చలేమని వాస్తవం చెప్పారు. కాగా దీనిపై ట్రైనింగ్ ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో హైపర్ లోకల్ యాక్టివిటీస్ చేస్తే పారిశుద్ద్యమైన నగరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇదంతా జరగడానికి కాస్త సమయం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

