మీరు అడవుల్లోకి వస్తే మేం జనాల్లోకి వస్తామంటున్న పులులు
అభయారణ్యాల్లో కి మనుషులు చొరబడి వన్యప్రాణులను వేటాడి హింసించడంతో …అవి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.అడవులను నివాసాలుగా మార్చడంతో….అవి నివాసాలను అడవులుగా మార్చేస్తున్నాయా అనుకునేంతగా సంచరిస్తున్నాయి.మీరు అడవుల్లోకి వస్తే…మేము జనాల్లోకి వస్తాం అని హెచ్చరించే విధంగా మనుషులను చంపి తినేస్తున్నాయి.ఇన్నాళ్లు యానిమల్ ఈటర్స్గా ఉన్న పులులు ఒక్కసారిగా విరుచుకుపడి మ్యాన్ ఈటర్స్ గా మారిపోయాయి. తెలంగాణ,ఏపి,కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో ఈ రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలను తీశాయి. అయినా పులిజాడను మాత్రం కనుక్కలేకపోతున్నారు.కొమురం భీం జిల్లాల్లో ఇద్దరిని చంపి తిన్న పులి.తాజాగా మహారాష్ట్రలో నిండు గర్భిణిని చంపేసింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.ఇప్పటికైనా అటవీశాఖాధికారులు స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.