ఓట్లు అడిగితే ప్రశ్నించండి …
స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగడానికి వస్తే ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించమని ప్రజలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు . కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోల్‌లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కనీసం యూరియా కూడా సరిగా సరఫరా చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో స్థానిక ఎన్నికల్లో అందరికీ తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయిందని , ఇంకా రెండేళ్లు మాత్రమే ఉందని మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.