Andhra PradeshHome Page Slider

సంపద పెంచకపోతే.. ప్రజలకు ఇచ్చేదెలా?

Share with

అమరావతి: సంపద పెంచకపోతే.. డబ్బును ఎలా పంచడం కుదురుతుంది అనేది, ఇది మిస్టరీకి వీడని ప్రశ్న. ఎక్కడి నుండి తీసుకొచ్చి పంచుతారని వైకాపా రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్‌కిషోర్ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణాన్ని సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే.. పంచడానికి సొమ్ము ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇది అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితికి దారితీస్తుంది. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలం అని ఆయన వ్యాఖ్యానించారు. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానెల్ని నిర్వహించిన షార్ప్ ఇన్‌సైట్స్ ఆన్ ఇండియా-2024 కార్యక్రమం కోసం పాత్రికేయురాలు సోమా చౌదరి తాజాగా ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులు ప్రస్తావనకు రాగా, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలం అంటూ ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతుండగా.. వైకాపా ప్రభుత్వానికి మాత్రం అప్పులు చేయడం తప్ప అభివృద్ధి, సంపద సృష్టించాలనే ఆలోచనే లేనట్లుగా కనుబడుతోంది. ఆ ధ్యాసే లేకపోవడం అనాలోచితం.