InternationalNews Alert

ఉక్రెయిన్ నాటోలో చేరితే ప్రపంచ యుద్దమే : రష్యా

నాటోలో ఉక్రెయన్ చేరితే మూడో ప్రపంచ యుద్దం తప్పదని రష్యా హెచ్చరించింది. రష్యా భద్రతా మండలిలోని అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు ‘ఈ విషయం ఉక్రెయిన్ కూడా తెలుసు. ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు కూడా మా ప్రత్యర్థులే’ అని తెలిపారు. ఇటీవల నాటోలో చేరే ప్రక్రియను వేగవంతం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరిన నేపథ్యంలో రష్యా ఈ విధంగా, స్పందించింది. మరో వైపు ఉక్రెయిన్‌లో తిరుగుబాటు ప్రాంతాలుగా పేర్కొంటున్న 4 ప్రదేశాలను రష్యా ఇటీవల ఆక్రమించుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క, డోనేట్క్స్ ప్రాంతాలను రష్యాలో విలీనం అయ్యాయి.