చిన్నారులలో ఈ లక్షణాలు గమనిస్తే..ఆ వ్యాధే..
చిన్నారులలో కొన్ని లక్షణాలను బట్టి థైరాయిడ్ వ్యాధిని కనిపెట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్య ఉండవచ్చని, తల్లి గర్భం నుండి బిడ్డకు సోకవచ్చని హెచ్చరిస్తున్నారు. అధిక హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య కారణంగా హైపర్ థైరాయిడిజం వస్తుంది. దీనివల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా రావచ్చు. ఈ కారణంగా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆలస్యంగా ఎదుగుతున్నట్లు అనిపిస్తుంది. వారి చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. ఊబకాయం బారిన పడతారు. వారి ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనంగా ఉంటాయి. ఈ లక్షణాలు పిల్లలలో గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు వైద్యులు. ఈ సమస్యలతో బాధపడే పిల్లలకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా సరైన పౌష్టికాహారాన్ని కూడా ఇస్తే చికిత్స ఫలితాలు బాగుంటాయి.