Home Page SliderNational

ట్రోలింగ్ ఆపకపోతే.. ఆత్మహత్య చేసుకుంటాం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరి, వర్షిణి దంపతులు సంచలన వీడియో రిలీజ్ చేశారు. తామిద్దరిని అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. తామిక తెలుగు రాష్ట్రాలకు రామని, కేధార్ నాథ్ కు వెళ్లిపోతున్నామని చెప్పారు. జీవితాంతం అక్కడే ఉంటామని పేర్కొన్నారు. ఇక నుంచి అఘోరీతోనే ఉంటానని.. తాను చాలా సంతోషంగా ఉన్నానని వర్షిణి తెలిపింది. ఇక అఘోరీ మొదటి భార్య అంతా ఫేక్ అని.. ఆధారాలు లేకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చిందో మాకు తెలియదంటూ పేర్కొన్నారు.