ఆ వైరస్ వస్తే ఈ సారి అంతా స్మాషే
చైనాలో కొత్త వైరస్ కలకలం సృస్టిస్తోంది.కరోనాని ఏడాది పాటు దాచిపెట్టి దాన్ని ప్రపంచ చిత్రపటం మీదకు వదిలితే.. అన్నీ దేశాలు పూడ్చుకోలేని మూల్యాన్ని చెల్లించాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.మళ్లీ అదే చైనా…అలాంటి వైరస్ నే దాచిపెట్టి ప్రపంచాన్ని మభ్యపెట్టాలని చూస్తుంది. కరోనా తరహా కొత్త వైరస్ చైనాని వణికిస్తుంది. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతుంది.ఇన్‌ఫ్ల్యూయెంజా A, HMPV వైరస్‌గా చెప్పుకొస్తున్నారు. అయినా ఈ విషయాన్ని ఆ దేశం గోప్యంగా ఉంచింది. కరోనా పక్షుల నుంచి మనుషులకు వస్తే…కొత్తగా పుట్టిన వైరస్ జంతువుల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.చైనాలో పెద్దాసుపత్రులన్నీ కొత్త వైరస్ సోకిన పేషంట్లతో కిక్కిరి సిపో తు న్నాయి.చైనాలో అక్కడక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.అయినా డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రపంచానికి నిజం చెప్పడం లేదు.కొత్త వైరస్ వ్యాప్తిని మొగ్గలోనే చిదిమేయకపోతే ఈ సారి ప్రపంచం తీవ్రంగా నష్టపోతుందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

