షారుఖ్ కనిపిస్తే అక్కడే తగలబెడతాను..
పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాట ఇప్పటికే అనేక వివాదాలకు కారణమైంది. బీజేపీ సహా రైట్ వింగ్ సంస్థలు ఈ పాటలోని కొన్ని దృశ్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో షారుఖ్, దీపికాలు ధరించిన దుస్తులపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదాంపై అయోధ్యలోని తపస్వి చాన్వీకి చెందిన మహంత్ పరమహంస వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ కనిపిస్తే ఉన్నచోటనే తగలబెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు షారుఖ్ పోస్టర్‌ను తగలబెట్టారు. ఒక వేళ ఆయన కానీ తనకు ఎదురుగా వస్తే సజీవ దహనం చేస్తానని హెచ్చరించారు. పఠాన్ సినిమా విడుదలైతే ఏకంగా థియేటర్లనే దగ్ధం చేస్తానని పరమహంస వార్నింగ్ ఇచ్చారు. ప్రేక్షకుంలందరూ పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని కోరారు.