అలా చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను: కేంద్రమంత్రి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా దేశంలో ఏ ఒక్కరైన తాను కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానని కేంద్రమంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. అయితే తనకు ఇతరుల నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి మాకు నెలకు రూ.3 లక్షల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. అయితే తన ప్రసంగాలను అమెరికాలో ఎక్కువగా చూస్తారని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడు కులం గురించి మాట్లాడనని..అందురూ సోదరసమానులేనని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ కమీషన్లు తీసుకుంటారని పలువురు ఆరోపించారు. అయితే ఆయన దీనిపై స్పందించి అలాంటి దేమి లేదని ఒకవేళ అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.


 
							 
							