crimeHome Page SliderNewsTelanganatelangana,

మైనర్లకు బండిస్తే..ఇకపై న్యూ రూల్స్..

లైసెన్సులు లేని మైనర్లకు వాహనాలు ఇస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ నోటీస్ విడుదల చేసింది. వారు తెలిసీ తెలియక వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిని కట్టడి చేయాలంటే శనివారం నుండి మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే యజమానిపై కేసులు నమోదు చేసి, రూ. 25వేల జరిమానా, 3 ఏళ్ల వరకూ జైలుశిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్‌ను కూడా 12 నెలల పాటు సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఆ మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత కూడా ఉండదు. గత మూడు నెలల కాలంలో మైనర్ డ్రైవింగ్ వల్ల 7 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ముగ్గురు మృత్యువాత పడ్డారని వెల్లడించారు.