Home Page SliderTelangana

జోగురామన్న నిరూపిస్తే.. నేను రాజీనామాకి రెడీ..

మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. పత్తి కోనుగోళ్లపై జోగురామన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో CCI ద్వారా కొనుగోళ్లు ఒకటే ధరతో కొనుగోలు చేస్తారని జోగు రామన్న నీకు తెలియదా అని ప్రశ్నించారు. గుజరాత్ లో CCI ద్వారా ఆదిలాబాద్ కంటే రూపాయి ఎక్కువ ఉన్న తన పదవీకి రాజీనామా చేస్తానని జోగురామన్నకు సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఎక్కుడున్నారని అన్న జోగు రామన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందించారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వెక్కడ ఉన్నావ్ అంటూ.. జోగు రామన్నను ఉద్దేశించి ప్రశ్నించారు. మార్కెట్ యార్డ్ దిక్కుకు కూడా రాలేదన్నారు. నేను లాలూచీ పడ్డా అన్నావు.. నువ్వు చేసినవి అన్నీ ఆడియోలు ఉన్నాయి.. బయట పెట్టాలా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నీ గతం గురించి తవ్వాల్సి వస్తుందన్నారు.