బఫర్ జోన్ లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా..
జన్వాడలో ఉన్న ఫాంహౌస్ బఫర్ జోన్లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టేందుకు సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తన పేరుతో ఎలాంటి ఫాంహౌస్ లేదన్నారు. తెలిసిన ఫ్రెండ్ దగ్గర నుండి లీజుకు మాత్రమే తీసుకున్నానని పేర్కొన్నారు. ఫాంహౌస్ నిబంధనకు విరుద్ధంగా ఉంటే కూల్చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. మంత్రుల ఫాంహౌస్ లతోనే కూల్చివేతలు ప్రారంభించాలని కేటీఆర్ అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. తాము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు… భారత రైతు సమితి కూడా అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదని కేటీఆర్ దుయ్యబట్టారు.

