InternationalNewsNews Alert

ఐసీసీ ట్రోర్నీల ప్రసార హక్కుల వేలం

రానున్న ఎనిమిదేళ్లలో జరిగే ఐసీసీ టోర్నిలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. క్రికెట్ కామధేనువు భారత మార్కెట్ నుండి భారీగా లాభాలు రాబట్టెందుకు ఐసీసీ క్రికెట్ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ వేలం వేయ్యడం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో.. ఇప్పుడు ఐసీసీ వేలం నిర్వహించనున్నట్టు తెలిపింది. టీవీ , డిజిటల్ , టీవీ అండ్ డిజిటల్ అనే  మూడు వేర్వేరు విభాగాలలో ఈ వేలం నిర్వహించనుంది.

ఈ హక్కులను సొంతం చేసుకునేందుకు టాప్ కంపెనీలు పోటికి దిగగా కేవలం డిస్నీ స్టార్ , సోని , జీ , వయాకామ్ , అమెజాన్ కంపెనీలు ఈ మాత్రమే బరిలో స్థానం సంపాదించుకున్నాయి. 2023-2031 మధ్య మహిళలు , పురుషుల విభాగాల్లో కలిపి 22 ఐసీసీ ఈవెంట్లు ఉండగా , వన్డే , అండర్-19 వరల్డ్ కప్‌లు , టీ20 ప్రపంచకప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫిని కూడా ఇందులో భాగం చేశారు. దీని వేలంలో మొత్తంగా ఐసీసీ సూమారు 4 బిలియన్ల డాలర్లను ఆశిస్తున్నట్టు సమాచారం.