ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్
ఛాంపియన్స్ ట్రోఫీపై చాలా వారాల తర్జన భర్జన అనంతరం షెడ్యూల్ని ఖరారు చేసింది ఐసిసి.రూల్ ఆఫ్ రొటేషన్ ప్రకారం ఈ సారి టోర్ని పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా..దానికి బీసిసిఐ నిరాకరించింది.భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.దీంతో పాకిస్తాన్ కూడా అంతే ఘాటుగా స్పందించి తాము కూడా భవిష్యత్‌లో భారత్‌లో పర్యటించబోమని చెప్పింది.దీంతో రంగంలోకి దిగిన ఐసిసి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చింది.దీంతో దాయాది దేశాల ఆంగీకారానంతరం షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది.ఈ మేరకు భారత్,పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుండగా,బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న, న్యూజిలాండ్‌తో మార్చి 1న తలపడనుంది.కాగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.