ICC ఛాంపియన్స్ ఫైనల్ వార్..టాస్ విన్నర్ న్యూజిలాండ్ బ్యాటింగ్
క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICC ఛాంపియన్స్ ఫైనల్‌కు అంతా సిద్ధమయ్యింది. ఎప్పటిలాగే భారత్ టాస్ ఓడింది. వరుసగా 12 సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా రికార్డు సాధించారు రోహిత్ శర్మ. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో టీమిండియా బౌలింగ్‌కు దిగింది. ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. పోటా పోటీగా జరిగే ఫైనల్ వార్‌ను చూడడానికి అంతా సిద్ధమయ్యారు. రోహిత్, కోహ్లీలు బాగా రాణించాలని, భారత్ కప్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. న్యూజిలాండ్ నుండి రచిన్ రవీంద్ర, విల్ యంగ్ బ్యాటింగ్ చేస్తుండగా, హార్థిక్ పాండ్యా, మొహ్మద్ షమీ బౌలింగ్ చేస్తున్నారు.