iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
ప్రసిద్ధ పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న రవిని కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అక్రమంగా సినిమాలను అప్‌లోడ్ చేస్తున్న రవి కరీబియన్ దీవుల్లో ఉండి iBomma నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
తాజాగా విడుదలైన సినిమాలను అదే రోజున పైరసీ రూపంలో వెబ్‌సైట్‌లో పెట్టడంపై సినీ నిర్మాతలు పలుమార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

