భారత్-పాక్ మధ్య క్రికెట్ జరగనివ్వాలని మోదీ సాహెబ్ను కోరుతా…
లెజెండ్స్ లీగ్ క్రికెట్ విత్ ఆసియా లయన్స్ లో పాల్గొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగడానికి అనుమతించాలని ప్రధాని మోడీని కోరతానని చెప్పారు. 2012 నుంచి పాకిస్థాన్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు డబ్ల్యూపీఎల్ లో కూడా పాక్ ఆటగాళ్లకు అవకాశం లేదని తెలిపారు. ఇటీవలి కాలంలో ఆసియా కప్ కోసం తమ జట్టును పాకిస్థాన్ కు పంపడానికి బిసిసిఐ సుముఖంగా లేదని, తటస్థ వేదికలో టోర్నమెంట్ నిర్వహించాలని కోరుతానని పేర్కొన్నారు.
మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, అతను మనతో మాట్లాడకపోతే మనం ఏమి చేయగలం? అఫ్రిది వ్యాఖ్యానించాడు. బిసిసిఐ చాలా బలమైన బోర్డు అనడంలో సందేహం లేదు, కానీ మీరు బలంగా ఉన్నప్పుడు, మీకు ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. మీరు ఎక్కువ మంది శత్రువులను సృష్టించడానికి ప్రయత్నించరు, మీరు స్నేహితులను చేసుకోవాలన్నారు. ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకుంటే మరింత బలపడతారు’ అని అఫ్రిది పేర్కొన్నారు. భారత జట్టులో తనకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారని, తాము కలిసినప్పుడు, చర్చించుకుంటామని, మొన్న రైనాను కలిశానని, తాను బ్యాట్ కావాలని అడిగానని, అతను తనకు బ్యాట్ ఇచ్చాడని అఫ్రిది ఈ సందర్భంగా తెలిపారు.