Home Page SliderNational

డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నేను నటించను..

మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె షూటింగ్ లో జరిగిన చేదు అనుభవం గుర్తుచేసుకున్నారు. సినిమా నిర్మాణ సమయంలో సెట్స్‌లో ఒక అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇటీవల మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమానికి హాజరైన నటి అలోషియస్ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అలవాటు ఉన్న నటులు నటించే సినిమాలో తాను నటించనని ఆమె పేర్కొన్నారు.