Telangana

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా చెప్పులు వేయను

టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం లోకి రావడమే లక్ష్యంగా సంచలన నిర్ణయానికి వచ్చారు తెలంగాణా మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని, తాను ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసినట్లు చెప్పారామె. అదేంటంటే మరోసారి ఎన్నికలు జరిగి కేసీఆర్ ప్రమాణ స్వీకారం వరకూ చెప్పులు లేకుండా తిరుగుతానంటున్నారు. తాను ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని, ఎవరి కోసమూ తన నిర్ణయాన్ని మార్చుకోనని తెగేసి చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన దేవుడు కేసీఆర్ అనీ, గిరిజనులందరి పక్షాన వారి బిడ్డగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటునానన్నారు. ఎండాకాలమైనా సరే చెప్పులు ధరించనని, ఇది తాను కేసీఆర్‌పై అభిమానంతో తీసుకుంటున్న నిర్ణయమని, తన వ్యక్తిగతమని పేర్కొన్నారు. తెలంగాణా ఏర్పడ్డాక మూడవ అసెంబ్లీ ఎన్నికలు ఇంకొద్ది నెలలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.