Andhra PradeshHome Page SliderNews AlertPolitics

అమరావతికి ఎదురులేకుండా చేస్తా..

అమరావతిని రాజధాని నగరం కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. అమరావతికి పూర్తి చట్టబద్దత కలిగేలా పఠిష్టంగా పార్లమెంట్‌లో చట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం..అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు స్పష్టం చేశారు.  అలాగే ఇకపై అవసరాల మేరకే భూమిని సమీకరిస్తామని పేర్కొన్నారు. ప్రధాన మోదీ అమరావతికి రానున్నారని, మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని..రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి ఇద్దామని చెప్పారు.