వాళ్లు నన్నే కిందపడేశారు.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా..
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ హాల్ లోకి కాంగ్రెస్ ఎంపీలతో కలిసి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తమను అడ్డుకున్నారన్నారు. ‘బీజీపీ ఎంపీలు నన్నే కిందపడేశారని.. దాంతో నా మోకాళ్లకు గాయాలయ్యాయని’ చెప్పారు. ఘటనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే.. మల్లికార్జున ఖర్గే.. కేంద్రమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఇవాళ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ కు నోటీసులు అందించారు. దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.