Home Page SliderTelangana

 కక్షతోనే నన్ను అరెస్టు చేశారు

తనను కేవలం కక్షతోటే అరెస్టు చేశారని, తాను ఎవరిపైనా చేయిచేసుకోలేదని ఈరోజు చంచల్ గూడా జైలు నుండి విడుదలైన వైఎస్ షర్మిల మండిపడ్డారు.  విడుదలైన తర్వాత ప్రజననుద్దేశించి మాట్లాడుతూ పోలీసులు తనను బెదిరించే ధోరణిలో దాడి చేసారని, తాను కేవలం ఆత్మరక్షణ కొరకే వారిని తోసానని, దాని వీడియోలను పదేపదే మీడియాలో ప్రసారం చేస్తున్నారన్నారు. తనను వారు బెదిరించే వీడియోలు, ఫోటోలను చూపించకుండా కేవలం వారికి అనుకూలంగా మాత్రమే కేసును తిప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ నిరుద్యోగులను అస్సలు పట్టించుకోవడం లేదని, తాము పోరాటాల ద్వారా వారికి బాసటగా నిలబడుతున్నామని హామీ ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.