Home Page SliderTelangana

ముఖ్యమంత్రి బీ-ఫామ్ ఇస్తారనే అనుకుంటున్నా

సీఎం కేసీఆర్ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, బీ-ఫామ్ ఇస్తారని అనుకుంటున్నానని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

పార్టీ మారే ఆలోచనే లేదు: అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం: సీఎం కేసీఆర్‌ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, బీ-ఫామ్ ఇస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నానని ఎమ్మెల్యే అబ్రహాం పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ఐటీఐ కళాశాలలో స్థానికులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీ-ఫామ్ ఆలస్యమైందని కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఎవరు అభివృద్ధి చేస్తారని విషయంపై వారికి అవగాహన ఉందని ఎమ్మెల్యే వివరించారు. తాను పార్టీ మారే ప్రశ్నే లేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని అబ్రహాం తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. జడ్పీటీసి రాజు, వైస్ఎంపీపీ దేవన్న, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు లోకేశ్వర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు.

సాగునీరు పంటకు అందించాలి: మిరప పంటలు ఎండిపోతున్నాయని, తుమ్మిళ్ల నీటి విడుదల చేయించాలని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో అబ్రహాం ఈఎన్‌సీ మురళీధర్‌రావుతో, ఎస్ఈ శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యను వివరించారు. నీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరారు.