Home Page SliderTelangana

కేసీఆర్ అంటే నాకు ఇష్టమే: మంత్రి పొంగులేటి

టిజి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే తనకు ప్రేమేనని, ప్రతిపక్ష నేతగా ఆయన తన అనుభవంతో అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని మేం కోరుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ పథకాలపై మేమేం భేషజాలకు పోవడం లేదు. మంచివి తీసుకుంటున్నాం. సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నాం అని తెలిపారు.