‘నేనెక్కడికీ వెళ్లలేదు..తప్పుడు ప్రచారం ఆపండి’.. మోహన్‌బాబు
సీనియర్ నటుడు మోహన్‌బాబు మీడియా వార్తలపై మండిపడ్డారు. తను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంటే, మీడియా వారు తాను పరారీలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించిందనే వార్త అబద్దమని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషన్‌ను కొట్టి వేయలేదని, కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఫిర్యాదుదారు రంజిత్‌కుమార్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిందని పేర్కొన్నారు. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో జర్నలిస్టుపై చేయిచేసుకున్నారు మోహన్‌బాబు.