‘ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది’..మోదీ
ఛత్తీస్ గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం మావోయిస్టులపై భారీగా ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన పోరాటంలో 28 మంది మావోయిస్టలు మరణించారు. ఈ ఆపరేషన్‌పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిలో పాల్గొన్న భద్రతా దళాలను ప్రశంసించారు. తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మావోయిజం నిర్మూలించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి అమిత్ షా పోస్టు పెట్టారు. ఈ పోస్టునే మోదీ రీ పోస్టు చేసారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారని, ఇది నక్సలిజం నిర్మూలనలో మైలురాయి అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలనకు సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. అని హామీ ఇచ్చారు.

