NationalNewsNews Alert

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నేనా..!?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా తన పేరును సోనియాగాంధీ ప్రతిపాదించారన్న విషయం తనకే తెలియదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. సీనియర్‌ నాయకుడైన గెహ్లోత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి.. రాజస్థాన్‌ సీఎంగా సచిన్‌ పైలట్‌ను నియమించాలని సోనియా ఆలోచిస్తున్నట్లు, ఈ మేరకు గెహ్లోత్‌తో మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. అయితే.. తాను ప్రస్తుతం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు చూస్తున్నానని, రాజస్థాన్‌ సీఎంగా సంతోషంగా ఉన్నానని గెహ్లోత్‌ చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని సెప్టెంబరు 20వ తేదీలోపు నియమిస్తానని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా అన్నారు. పార్టీ నాయకులంతా రాహుల్‌ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. కానీ రాహుల్‌ మాత్రం ససేమిరా అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రియాంక గాంధీకి కూడా పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదని వార్తలొస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక ప్రస్తుతం చురుకైన పాత్ర పోషిస్తున్నారు.